calender_icon.png 24 February, 2025 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులలో దాగి ఉన్న మేధాశక్తిని వెలికితీయాలి

24-02-2025 12:00:00 AM

భద్రాచలం, ఫిబ్రవరి 23 (విజయ క్రాంతి): గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులలో దాగి ఉన్న మేధాశక్తిని, నైపుణ్యాలను వెలికి తీసి వారి భవిష్యత్తును ఉన్నత స్థాయికి ఎదగడానికి  ప్రతిభ  పరీక్షల నిర్వహణతో ప్రతిభావంతులను గుర్తించడానికి కృషి చేస్తున్నామని డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ అన్నారు. ఆదివారం భద్రాచలంలోని ఏ జి హెచ్ ఎస్ బాలికల ఆశ్రమ పాఠశాలను ఆమె సందర్శించారు.

పరీక్షలు రాయడానికి వచ్చే బాలికలకు సూచనలు ఇస్తూ ఎటువంటి భయాం దోళనలు మనసులో పెట్టుకోకుండా మీలో దాగి ఉన్న నైపుణ్యాలను ప్రతిభను వెలికి తీసి నిర్భ యంగా పరీక్షలు రాసి అత్యుత్తమ ర్యాంకులు తెచ్చుకోవాలని అన్నారు. ఈ పరీక్షలు పదో తరగతి తర్వాత మీరు రాసే కాంపిటేటివ్ పరీక్షలు, జేఈఈ, నీట్, ఎంసెట్ పోటీ పరీక్షలు రాయడానికి ఎంతో ఉపకరిస్తాయని అన్నారు.

ఈ ప్రతిభా ప్రోత్సాహక పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థిని లకు ఉపాధ్యాయులు కానీ ఇంజ్యులేటర్స్ గాని ఎవరు సహాయ సహకారాలు అందించవద్దని, పిల్లలు వారి ప్రతిభ ద్వారానే సొంతంగా పరీక్షలు రాసేలా చూడాలని, గ్రూప్స్ పరీక్షలు ఏ విధంగా పగడ్బందీగా నిర్వహిస్తారో ఆ విధంగా చాలా జాగ్రత్తగా నిర్వహించేటట్లు చూడాలని పరీక్షా కేంద్రం స్కాడ్ , స్పెషలాఫీసర్ ఏటిడిఓ చంద్రమోహన్ కు ఆదేశించారు.

అనంతరం పరీక్ష హాల్లో విద్యార్థినిలకు కల్పించిన వసతి సౌకర్యాల గురించి హెచ్ ఎం ను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు జరుగు సమయంలో గురుకులం ఆర్సిఓ నాగార్జున రావు సందర్శించి ఉపాధ్యాయులు ఎవరు పరీక్షా హాల్లోకి వెళ్లకూడదని, పరీక్ష హాలులో సెల్ ఫోన్లు గాని మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి ఉండకూడదని, ఇంజ్యులేటర్లు ఎవరు పిల్లలకు సందేహాలు వస్తే వివరణ ఇవ్వకూడదని అన్నారు.

వేరే పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులకు సంబంధించిన ఉపాధ్యా యులు ఎవరు పరీక్షా హాల్లోకి రాకుండా సంబంధిత స్కాడ్ చూడాలని, ఎటువంటి అవకత వకలకు పాల్పడకుండా ప్రశాంత వాతావరణంలో విద్యార్థినిలు పరీక్షలు బాగా రాసి మంచి ర్యాంకులు సాధించాలని విద్యార్థినిలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం సుభద్ర, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.