calender_icon.png 11 January, 2025 | 4:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కథే హీరో.. ఊహకు అందదు

20-12-2024 12:00:00 AM

వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. ఈ సినిమాకు రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహించారు. అనన్య నాగళ్ల, సీయా గౌతమ్ కీలక పాత్రలు పోహిస్తున్న ఈ చిత్రాన్ని లాస్యారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ సక్సెస్ రైడ్ ప్రెస్ మీట్ ని నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీ నందిపాటి మాట్లాడుతూ.. “శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

3 మిలియన్ డిజిటల్ వ్యూస్‌ని క్రాస్ చేయడం సినిమాకి బిగ్ ఎచీవ్ మెంట్. ట్రైలర్‌కి మంచి రివ్యూస్ వచ్చాయి. ఈ సినిమాలో కథే హీరో. కథని నమ్మే ఈ సినిమాతో ముందుకు వెళ్తున్నాను. ఇది సస్పెన్స్ థ్రిల్లర్. సినిమా కంప్లీట్ అయిన తర్వాత పార్ట్ 2 ఎప్పుడనే ఎక్సయిట్‌మెంట్‌ని క్రియేట్ చేస్తుంది” అన్నారు. అనన్య నాగేళ్ళ మాట్లాడుతూ.. “పెర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్రలు వస్తున్నాయి. ఈ సినిమాలో చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. కథ, నా క్యారెక్టర్ రెండూ నచ్చాయి. క్యారెక్టరైజెషన్ చాలా కొత్తగా ఉంటుంది” అన్నారు. డైరెక్టర్ మోహన్ మాట్లాడుతూ.. “ఉత్తరాంధ్ర నేపథ్యంలో జరిగే కథ ఇది.

రాజీవ్‌గాంధీ హత్యకి గురైన రోజు జరిగే కథ ఇది. ఆయన విశాఖ పర్యటన ముగించుకుని శ్రీపెరంబుదూర్ వెళ్లారు. అక్కడ హత్యకి గురయ్యారు. అలాంటి ఓ పెద్ద సంఘటన జరిగినప్పుడు చిన్న సంఘటనల్ని ఎవ్వరూ పట్టించుకోరు. ఆ రోజు జరిగిన కొన్ని కల్పిత సంఘటనల చుట్టూ అల్లుకున్న కథ ఇది. సినిమా ఏమాత్రం ఊహకు అందని విధంగా ఉంటుంది” అన్నారు. నిర్మాత రామణారెడ్డి మాట్లాడుతూ.. “మోహన్ చెప్పిన కథ చాలా నచ్చింది. కథని నమ్మి ఈ సినిమాని చేశాను” అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు హనీష్ కురివిల్లా, రవితేజ, భద్రం తదితరులు పాల్గొన్నారు.