calender_icon.png 30 September, 2024 | 9:04 AM

మాయగాళ్ల ఎత్తులు.. ప్రజలకు చిక్కులు

30-09-2024 12:13:11 AM

అధిక వడ్డీ ఆశ చూపి కోట్లు కొల్లగొడుతున్న కేటుగాళ్లు

కస్టమర్లను ఆకర్షించడానికి మొదట్లో సక్రమంగా వడ్డీ చెల్లింపు

బోర్డు తిప్పేస్తున్న సంస్థలు

కేసులు నమోదవుతున్నా రికవరీ లేదంటూ బాధితుల ఆవేదన

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ ౨9 (విజయక్రాంతి): నగరం లో రోజుకో కొత్త తరహా మోసం వెలుగుచూస్తోంది. అమాయక ప్రజలకు అధిక వడ్డీ ఆశ చూపి.. రూ.కోట్లలో దోచుకుంటున్నారు కొం దరు కేటుగాళ్లు. పథకం ప్రకారం కోట్లాది రూపాయల వసూళ్లే టార్గెట్‌గా సంస్థలు ప్రారంభించడం.. తమ టార్గెట్ పూర్తయ్యాక సంస్థ బోర్డులు తిప్పేయడం నిత్యకృ త్యంగా మారింది.

కస్టమర్లను ఆకర్షించడానికి మొ దట్లో వడ్డీలు సకాలంలో చెల్లించడంతో అధిక వడ్డీ వస్తుందనే ఆశతో వేలాది మంది పెట్టుబడులుగా పెట్టి మోసపోతున్నారు. మరికొంత మంది తమ వ్యాపారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి యూట్యూబర్లతో ప్రచా రం నిర్వహిస్తూ, వారు కూడా సంస్థలో పెట్టుబడులు పెట్టి భారీగా లాభాలు గడించి నట్లు చూపించడంతో ప్రజలు కూడా నిజమేనని న మ్మి పెట్టుబడులు పెడుతున్నారు.

రియల్ ఎస్టేట్, అధిక వడ్డీ, వ్యా పార సంస్థలలో భాగస్వామ్యం, షేర్లలో పెట్టుబడులు చూపి ప్రజల నుంచి కోట్ల రూపాయ లు వసూలు చేస్తున్నారు. అత్యాశతో పెట్టుబడి పెట్టి అనంతరం మోసపో యామని గ్రహించిన బాధితులు సీసీఎస్(సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్) ముందు క్యూ కడుతున్నారు. 

వేల కోట్ల దోపిడీ..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల రూపాయల మోసా లు జరుగుతున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేసులు నమోదు అవుతున్నా.. రికవరీ లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసులు నమోదు చేసి నిందితులను విచారిస్తున్న ఈవోడబ్ల్యూ(ఆర్థిక నేర విభాగం) పోలీసులు..

వారి బినామీలపై దృష్టి సారించట్లేదని అనుమా నం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిందితులకు సహకరిస్తూ గతంలో సీసీఎస్‌లో పనిచేస్తున్న ఓ ఏసీపీ అక్రమాస్తుల కేసుల విషయంలో జై లుకు వెళ్లడం, సీసీఎస్‌లో పనిచేస్తున్న ఓ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం ముందే లంచం తీసు కుంటూ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. 

బయటకు రాని బినామీల వివరాలు

ఆర్థిక నేరాలకు పాల్పడుతూ వందల కోట్లు దోచుకుంటున్న కేటుగాళ్లు కొనుగోలు చేసిన అక్రమ ఆస్తులు, బినామీల వివరాలు మాత్రం బయటకు రావడం లేదు. కేవలం బాధితుల ఫిర్యాదు ఆధారంగా నిందితులపైనే తూతూమంత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వందల కోట్ల దోపిడీలకు పాల్పడిన నిందితుల నుంచి రికవరీ మాత్రం జరగడం లేదని వాపో తున్నారు. కేసులు, కోర్టులతో తమకు ఒరిగేదేమీ లేదని, డబ్బు రికవరీ చేసి తమకు అం దించాలని బాధితులు కోరుతున్నారు.   

ఈ మధ్య చోటుచేసుకున్న కొన్ని ఘటనలు

* మాదాపూర్‌లో డీకేజెడ్ టెక్నాలజీస్ సంస్థలో పెట్టిన పెట్టుబ డులకు కేవ లం 25 రోజుల్లోనే రెట్టింపు ఇస్తామం టూ 18 వేల మంది బాధితుల ను నిం డా ముంచి సుమారు 700 కోట్లు కొల్లగొట్టారు కొందరు కేటుగాళ్లు.

* జీఎస్‌ఆర్ గ్రూప్స్ ఇన్‌ఫ్రా ‘ఈవీకే ప్రా జెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో సుమా రు 150 నుంచి 200 మంది బాధితులను మోసం చేసి రూ. 200 కోట్లతో పరారయ్యారు సంస్థ ప్రతినిధులు.

* అబిడ్స్‌లోని తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్‌లో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న నిమ్మగడ్డ వాణి బాల.. బ్యాంక్‌లో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చే వినియోగదారులను ఆకర్షించి, వారికి అధిక వడ్డీ ఆశ చూపి బ్యాంకుకి సమీపంలోని తన భర్త మేక నేతాజీ ఏర్పాటు చేసిన శ్రీ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌లో డిపాజిట్లు చేయించింది. అలా డిపాజిట్ల రూపంలో డబ్బులు కట్టించుకుని అధిక వడ్డీలు ఇస్తామని నమ్మిం చి, 517 మంది దగ్గరి నుంచి సుమారు రూ.200 కోట్లు వసూలు చేసి ఉడాయించారు. నగరంలో ఇన్ని మోసాలు జరిగినా ప్రజలు ఇంకా మోస పోతూ నే ఉండడం గమనార్హం.