calender_icon.png 1 November, 2024 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీ అబద్ధాలకు పరాకాష్ట

15-07-2024 01:03:12 AM

న్యూఢిల్లీ, జూలై 14 : గత నాలుగేళ్లలో ఎనిమిది కోట్ల ఉద్యోగాలు ఇ చ్చామని శనివారం ప్రధాని మోదీ చే సిన వ్యాఖ్యలను కాంగ్రెస్ జాతీయ అ ధ్యక్షుడు ఖర్గే ఖండించారు. ఓవైపు దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుంటే.. వాస్తవాలను కప్పి పుచ్చు కునేందుకు మోదీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగా ల కల్పన విషయంలో పచ్చి అబద్ధాలు మాట్లాడు తున్నారని ధ్వజమెత్తారు. “మీరు 2020 ఆగస్టులో ప్రారంభించిన నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ద్వారా నాలుగేళ్లలో ఒక్క పరీక్ష కూడా ఎందు కు నిర్వహించలేదు. కేటాయించిన 1.517 కోట్ల నిధుల్లో కేవలం 58 కోట్లే ఎందుకు ఖర్చు చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ హ క్కులను కాలరాయడానికి ఉద్దేశపూర్వకంగానే పనిచేయకుండా ఉంచారా” అని నిలదీశారు.