నేటి ప్రపంచ వయోజనుల్లో శారీరక వ్యాయామం లేదా శారీరక శ్రమ కొరవడడం మరో నిశ్శబ్ద సంక్షోభంగా ఆవిర్భవిస్తున్నది. ‘సిట్టింగ్ ఈజ్ కిల్లింగ్’ అనే నినాదం నేటి డిజిటల్ ప్రపంచంలో తరచుగా, యమ ఘాటు గా, కటువుగా వినిపిస్తున్నది. ప్రపంచ జనాభాలో దాదాపు 31 శాతం అంటే, 180 కోట్ల పెద్దలు లేదా వయోజనులు (అడల్ట్స్) నిర్దేశిత శారీరక వ్యాయా మాలకు దూరంగా ఉంటూ, అనారోగ్య సమస్యలకు కొనితెచ్చుకుంటున్నారని ‘ఐరాస- డబ్ల్యూహెచ్‌ఓ’ నివేదిక స్పష్టం చేసింది.
2010 నుంచి 2022 మధ్య కాలంలో వయోజనుల్లో శారీరక వ్యాయామ జీవన శైలి 5 శాతం వరకు తగ్గిందన్నది కూడా గమనార్హం. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2030 నాటికి ఈ ‘నిష్క్రియాత్మక ధోరణి’ 35 శాతం వరకూ పెరగవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సుల ప్రకారం, వయోజనులు వారానికి కనీసం 150 నిమిషాలు ఓ మోస్తరు నడక/ వ్యాయామం చేయాలని లేదా 75 నిమిషాల వేగవంతమైన నడక లేదా శారీరక శ్రమ అలవాటు చేసుకోవాలని వారు సూచిస్తున్నారు.
అనారోగ్యాలు పొంచి వుంటాయి!
వయోజనుల్లో శారీరక శ్రమ లోపించినపుడు టైప్-2 మధుమేహం, గుండెపోటు, స్ట్రోక్, చిత్త వైకల్యం లేదా డెమెన్షియా, క్యాన్సర్ లాంటి తీవ్రమైన హృదయనాళ సంబంధ రుగ్మతలు లేదా కార్డియోవాస్క్యులర్ వ్యాధుల పాలవు తారని అంచనా. ఈ మేరకు ‘డబ్ల్యూ హెచ్‌ఓ’ నేతృత్వ అధ్యయన ఫలితాలను తాజా ‘లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురితమైన వ్యాసం పేర్కొన్నది. శారీరక వ్యాయామ నియమాలు పాటించడం ద్వారా క్యాన్సర్, హృదయ సంబంధ రుగ్మతలు, మానసిక అనారో గ్యాలు క్రమంగా తగ్గుతాయని కూడా నిపుణులు తేల్చారు.
ఆసియా పసిఫిక్ ప్రాంత ధనవంతుల్లో 48 శాతం, దక్షిణా సియాలో 45 శాతం, ఇతర ప్రాంత వయోజనుల్లో 28 శాతం, అధిక ఆదా య పశ్చిమ దేశాల వయోజనుల్లో 14 శాతం మంది తగు శారీరక వ్యాయామం చేయడం లేదన్నది గమనార్హం. ఈ ప్రాంతాల పెద్దలు పలు అనారోగ్యాల కోరల్లో చిక్కుకోవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయనీ వారు హెచ్చరి స్తున్నారు. శారీరక వ్యాయామ నియ మాల్లో పురుషులతో పోల్చితే మహిళలు మరింత వెనుకబడి ఉన్నట్లు కూడా వారు గమనించారు.
సత్ఫలితాలు ఎన్నో!
ప్రజల్లో శారీరక వ్యాయామ ప్రాధాన్యాలను వివరించడం, నిత్యం వ్యాయామాన్ని మరో వినోదంగా అందించడం, శారీరక శ్రమకు తగిన సమయాన్ని దినచర్యలో కేటాయించడం, పిల్లల నుండి పెద్దలకు కనీస ఆరోగ్య పరిరక్షణ పరిజ్ఞానాన్ని అందించడం, ఆధునిక జిమ్ కల్చర్‌ను ప్రోత్సహిం చడం, అందరికీ అందుబాటులో వ్యాయామ కేంద్రాలను ఏర్పాటు చేయడం లాంటి పలు చర్యలు రేపటి ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి ఊతం ఇస్తాయి.
ఈ విషయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవడమే కాక ఇరుగు పొరుగు వారికి కూడా తెలియజేయాలి. శారీరక వ్యాయామ ఆరోగ్య రహస్యాల్ని ప్రజల చెంతకు చేర్చడానికి ప్రభుత్వాలు, పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు, విద్యా వంతులు, విద్యాలయాల ఉపాధ్యా యులు ప్రతిన బూనాలి. ‘మన ఆరోగ్యం మన చేతుల్లోనే’ ఉంటుందన్న సత్యాన్ని అందరికీ తెలియచేయాలి.
‘చికిత్స కన్నా నివారణ తేలిక’ అని, నేటి శారీరక వ్యాయామమే రేపటి ఆరోగ్య సౌభాగ్యమని ప్రతీ వయో జనుడూ విధిగా తెలుసుకోవాలి. శారీరక చలనమే ఎంతో శక్తిదాయకమని, దేహ నిశ్చలత్వం అసలు రోగరకారణమనీ అందరం నమ్ముదాం.
డా.బుర్ర మధుసూదన్ రెడ్డి
సెల్: 9949700037