calender_icon.png 22 December, 2024 | 10:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సురుచి పతకాల పంట

22-12-2024 12:24:14 AM

న్యూఢిల్లీ: హర్యానా టీనేజ్ షూటర్ సురుచి ఫొగాట్ 67వ జాతీయ షూటిం గ్ చాంపియన్‌షిప్‌లో పతకాల పంట పండిస్తోంది. రెండు రోజుల వ్యవధిలో నాలుగు స్వర్ణాలతో సురుచి చరిత్ర సృష్టించింది. శనివారం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ యూత్ విభాగంలో సురుచి స్వర్ణం సాధించింది. సమ్రత్ రానాతో జతకట్టిన సురుచి 16 ఉత్తరాఖండ్‌కు చెందిన అభినవ్ దేశ్వాల్ జోషిపై విజయం సాధించింది. 10 మీటర్ల మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ఆర్మీ షూటర్లు రవీందర్ సింగ్ సేజల్ కాంబ్లే 16 ముకేశ్ నెలవల్లి ప్రణవి ద్వారమ్ (ఆంధ్ర)పై విజయం సాధించి స్వర్ణం కైవసం చేసుకోగా.. జూనియర్ మిక్స్‌డ్ టీమ్ ఎయిర్ పిస్టల్ ఫైనల్లో జోనాథన్ గావిన్ గౌడ పసిడి దక్కించుకున్నారు.