calender_icon.png 16 January, 2025 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాడెద్దులు కట్టలేక.. కౌలు రైతే కాడి పట్టి

08-07-2024 02:13:22 PM

గద్వాల (వనపర్తి )(విజయక్రాంతి ): కాడి కట్టించే స్తోమత లేని ఓ కౌలు రైతు తాను వేసిన కంది పంటకు కలుపు తీసేందుకు తానే కాడిపట్టి కలుపుతీస్తూ కనిపించాడు. ఈ దృశ్యం జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం కొంకల గ్రామంలో దర్శనం ఇచ్చింది. కొంకల గ్రామానికి చెందిన లక్ష్మన్న అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి వద్ద రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని కంది పంట సాగు చేశాడు. కలుపు నివారణతో పాటు  అడుగు పిండి వేసేందుకు గడెం మాట్లాడారు కానీ రెండు వేలకు పైగా డిమాండ్ పెరగడంతో తన కుటుంబ సభ్యులతో కలిసి తామే జోడెడ్ల లాగా ఓ కర్ర లాంటి ఇనుము పైపు నకు  తాడును కట్టి లాగుతూ కలుపు తీయడంతో పాటు అడుగు పిండి వేస్తూ కనిపించాడు. పంటలు పండించేందుకు పెట్టుబడి సాయం కూడా అందకపోవడంతో ఇప్పటికే దళారుల వద్ద భారీ మొత్తంలో అప్పు చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.