calender_icon.png 15 January, 2025 | 11:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికుల శ్రమ వెలకట్టలేనిది !

14-01-2025 12:14:03 AM

* వారికి పాదాభివందనం చేయాలి..

* జెడ్  టన్నెల్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ 

శ్రీనగర్, జనవరి 13: ‘టన్నెల్ పూర్తి చేసేందుకు కార్మికులు 9 ఏళ్ల పాటు అహర్నిశలు పనిచేశారు. వారికి అంకితభావానికి పాదాభివందనం చేయాలి. వారి దృఢ సంకల్పంతోనే పనులు సకాలంలో పూర్తయ్యాయి. పనులు చేస్తూ కొందరు ప్రాణాలు సైతం కోల్పోయారు. వారికి నా నివాళి. వారి సేవలు వెలకట్టలేనివి. దేశం కోసం వారందించిన సేవలు స్ఫూర్తిదాయకం’ అని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు.

సోమవారం ఆయన జమ్మూకశ్మీర్‌లో పర్యటించారు. గాందర్‌బల్ జిల్లాలో నిర్మించిన జడ్ మోర్ సొరంగాన్ని ప్రారంభించారు. దీని ద్వారా కశ్మీర్ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ తదితరులు పాల్గొన్నారు. ఈ టన్నెల్ వల్ల విపత్కర పరిస్థితుల్లో కూడా కశ్మీర్‌కు రాకపోకలు సాగించవచ్చు.