19-04-2025 01:27:50 AM
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్ల , ఏప్రిల్ 18 : గొల్లకురుమల అభివృద్ధికి కృషి చేస్తామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల మున్సిపల్ పరిధి దేవునిఎర్రవల్లి వార్డులో నూతనంగా నిర్మించిన కురుమ సంఘం భవనాన్ని శుక్రవారం కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గే మల్లేశంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తితో కురుమల ఆర్థికాభివృద్ధి పొందాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు.
దేవునిఎర్రవల్లిలో కురుమ భవన్ ఏర్పాటుకు కృషి చేసిన సంఘం సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణరెడ్డి, హైదరాబాద్ బీఎస్‌ఎన్‌ఎల్ బోర్డు సభ్యుడు సామ మాణిక్యరెడ్డి, కురుమ సంఘం మండలాధ్యక్షుడు కసిరె వెంకటేశ్, బీఆర్‌ఎస్ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి దేశమల్ల ఆంజనేయులు,
బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, సీనియర్ నాయకులు ఎదిరె రాములు, ఎదిరె శ్రీశైలం, దేవునిఎర్రవల్లి కురుమ సంఘం అధ్యక్షుడు కరికే సత్యనారాయణ, సంఘం ఉపాధ్యక్షుడు అంగరెల్లి రాజు, ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి బేగరి అరుణ్ కుమార్, మాజీ సర్పంచ్ కంకంటి శ్యామలయ్య పాల్గొన్నారు.