calender_icon.png 24 January, 2025 | 5:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేక్షకుల సంతోషమే నాకు ఆనందం

14-08-2024 12:05:00 AM

హీరో నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్, ఎస్‌జే సూర్య, సాయికుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ ప్రధాన తారాగణంగా ఉన్నారు. ఈ మూవీ ట్రైలర్‌ను చిత్రబృందం మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేసింది. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాపై ఈ ట్రైలర్ భారీ అంచనాలను పెంచింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో నాని మాట్లాడుతూ.. “ఈ నెలాఖరి రోజులు అదిరిపోయేలా ఉంటాయి.

ప్రేక్షకులకు నాపై ఉన్న ప్రేమకు కృతజ్ఞుణ్ని. మీరు ఇలానే ప్రేమ చూపిస్తూ ఉంటే వందశాతం కష్టపడి మంచి సినిమాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తునే ఉంటా. ఈ సినిమాలో ఒక డైలాగ్ చెప్పాలంటే.. ‘నాకు కోపం వచ్చింది, నాకు కోపం వచ్చిందంటే వీళ్లు నా మనుషులు, వాళ్ల సమస్య నా సమస్య. వాళ్ల సంతోషం నా సంతోషం’. అందుకే ఈ ఆనందాన్ని (అభిమానుల సంతోషమే తన సంతోషమని ఉద్దేశంతో) సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ కార్యక్రమానికి వచ్చా” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్‌జే సూర్య, హీరోయిన్ ప్రియాంక మోహన్, నిర్మాత దానయ్య, హర్షిత్ రెడ్డి మాట్లాడారు.