calender_icon.png 16 October, 2024 | 6:55 PM

మున్సిపల్ కార్పొరేషన్ లో ఇంటి దొంగల చేతివాటం...

16-10-2024 04:54:39 PM

కార్యాలయంలో మాయమవుతున్న విలువైన వస్తువులు..

జిల్లాలు దాటిన సామాన్లు,ట్రాక్టర్ ట్రాలీ, ఫాగింగ్ యంత్రాలు మాయం...

దొంగలకు వెన్ను దన్నుగా నిలుస్తున్న అధికార పార్టీ నాయకులు..

బాద్యులు ఎవరో తెలిసినా చర్యలకు జంకుతున్న అధికారులు...

మేడిపల్లి, (విజయక్రాంతి): పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో వింత పరిస్థితి నెలకొంది. విలువైన వస్తువులు మాయమవుతున్నా మాకెందుకు అన్నట్లుగా వ్యవహారిస్తున్నారు ఇక్కడి అధికార గణం. ఫలితంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో విలువైన వస్తువులు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి. ట్రాక్టర్ ఇంజన్లు కనబడకుండా పోవడంతో పాటు, ట్రాలీలయితే ఏకంగా వేరే జిల్లాలో దర్శనమవడం పెద్ద చర్చనీయంశంగా మారింది. పీర్జాదిగూడ మున్సిపల్ కార్యాలయ సిబ్బంది చేతి వాటంతో ఏకంగా ట్రాక్టర్ ట్రాలీ మాయమై జిల్లాలు దాటించి అమ్ముకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పారిశుధ్య విభాగంలో దోమల ఫాగింగ్ యంత్రాల లెక్కలతో కూడా తేడా ఉందని సమాచారం

సిబ్బందికి  అందించే సబ్బులు, నూనెలు వంటి చిన్న వస్తువులలో చేతివాటం ఎంతో? పెద్ద స్థాయిలో అధికారి అండ లేనిదే ఇది సాధ్యమ అని ప్రజల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు చేసారో తెలిసినా రికవరీ చేయని వైనం.. చర్యలు తీసుకోవటానికి జంకుతున్న కార్పొరేషన్ అధికారి, కారణం అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నియోజకవర్గ నాయకులేనా? మరెందుకు చర్యలు తీసుకోవడం లేదు.. అడ్డుకుంటున్న నాయకులు ఎవరు? అసలు పాలక వర్గం, అధికారులు ఎం చేస్తున్నట్లు? అడ్మినిస్ట్రేషన్ పై అవగాహన లేక ఎక్కడి సమస్యలు అక్కడే వదిలేయడంతో.. పనుల్లో జాప్యం వల్ల ఇప్పటికే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఇప్పటికైనా అధికార పార్టీ పాలక వర్గం పనుల, విధుల నిర్వహణపై దృష్టి పెట్టాలని, గతంలో ఇక్కడ  పనిచేసిన సానిటేషన్ ఇన్స్పెక్టర్ బిల్లుల చెల్లింపులో  లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారుల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే అది పునరావృత్తం  కాకుండా ప్రస్తుతం కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని బాద్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి ఎడవెల్లి రఘువర్ధన్ రెడ్డి,  మున్సిపల్ కమిషనర్ ని కలసి డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఆంజనేయులు, బాలరాజు, వెంకట్, యసారం శ్రీనివాస్, జగన్ రెడ్డి, మల్లం వెంకటేష్, శివరాజు, నాయకులు అక్కల శ్రీను, నాగరాజు, తిరుమలేష్, సోమేశ్, మురళి, కిరణ్ నాయక్, రాధాకృష్ణ, సురేష్, బాలరెడ్డి, రమేష్, పాషా, నర్సయ్య, రామకృష్ణ, సురేందర్ రెడ్డి, అశోక్, సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.