calender_icon.png 8 January, 2025 | 7:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హత్యకేసులో ప్రవాస భారతీయుల హస్తం!

07-01-2025 12:47:55 AM

యూఎస్ పోలీసుల అదుపులో ఐదుగురు

న్యూయార్క్, జనవరి 6: ఓ వ్యక్తి హత్యకేసులో ఐదుగురు ప్రవాస భారతీయులను అరెస్ట్ చేసిన అమెరికన్ పోలీసులు వారిపై హత్యాభియోగం మోపారు. ప్రవాస భారతీయుడైన కుల్దీప్ (35) కనిపించడం లేదంటూ కుటుంబసభ్యులు 2024, అక్టోబర్ 26న ఫిర్యాదుచేశారు. న్యూజెర్సీలోని మాంచెస్టర్ గ్రీన్‌వుడ్ వైల్డ్‌లైఫ్ అటవీప్రాంతంలో అతడి మృత దేహాన్ని గుర్తించారు.

ఎఫ్‌బీఐ డిసెంబర్ 20న నలుగురు ప్రవాస భారతీయులైన సౌరవ్, గౌరవ్, నిర్మల్ సింగ్, గుర్దీప్ సింగ్‌ను అదుపులో తీసుకుంది. తాజాగా కేసులో ప్రధాన అనుమానితుడైన సందీప్ కుమార్‌ను అదుపు లో తీసుకుంది.