27-04-2025 12:00:00 AM
పోషకాహార లోపం, సరైన సంరక్షణ లేకపోవడం వల్ల కుదుళ్లు బలహీనమై కురులు రాలిపోతాయని నిపుణులు చెబుతున్నారు. కుదుళ్లు బలంగా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..
మాడు మీద చర్మం పొడిబారకుండా చూసుకుంటే కుదుళ్లు బలపడతాయి. ఆముదం, కొబ్బరినూనె, బాదం నూనె, ఆలివ్ నూనెల్లో ఒకదానితో తలంతా మర్దన చేసుకుంటే మంచి ప్రయోజనం కనిపిస్తుంది.
ఆ నూనెని కొద్దిగా వేడిచేసి ఉపయోగించడం వల్ల మాడు మీద రక్తప్రసరణ పెరిగి కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రొటీన్లు, ఐరన్, బయోటిన్ లాంటి పోషకాలు ఉన్న ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకోవాలి. గుడ్లు, పాల ఉత్పత్తులు, తాజా కూరగాయలు, ఆకుకూరలు, పళ్లను ఆహారంలో చేర్చుకుంటే కురుల కుదుళ్లు బలపడతాయి.