calender_icon.png 22 January, 2025 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరోమారు పేలిన తుపాకీ

21-01-2025 01:22:48 AM

* ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు మహిళా నక్సలైట్లు మృతి 

* గాయాలపాలైన కోబ్రా కమాండర్

చర్ల, జనవరి 20:  ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లా కుల్హారీఘాట్, భాలుడిగ్గీ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. సోమవారం సాయంత్రం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మద్య జరిగిన ఎదరుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మరణించగా, కోబ్రా బెటాలియన్ సైనికుడు గాయాలపాలయ్యాడు.

గాయపడిన సైనికుడిని విమానంలో తరలించారు. ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించారు. ఈనెల 16న బీజాపూర్ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్లో 18 మంది నక్సల్స్ హతమయ్యారు.