నిర్మల్ (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు వస్తే ప్రజలకు హామీ ఇచ్చిన ప్రతి అంశాన్ని నిలబెట్టుకొని ప్రజాపాలన కొనసాగించాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. శనివారం నిర్మల్ లో నిర్వహిస్తున్న సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు 19 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం వారి డిమాండ్లపై చర్చించకపోవడం ఉద్యోగులపై ఉన్న ప్రేమను ఏ పార్టీతో తెలుస్తుందన్నారు. వారు చేస్తున్న పోరాటానికి బిజెపి పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాజేష్ బాబు, ఉద్యోగులు పాల్గొన్నారు.