calender_icon.png 8 January, 2025 | 5:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడి టీచర్ల, హెల్పర్ల హామీని అమలు చేయాలి

07-01-2025 05:25:36 PM

కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ ధర్నా

పాల్గొన్న ఎమ్మెల్యే కునేంనేని...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ వేతనాలు 18 వేలు పెంపు హామీ ప్రభుత్వం అమలు చెయ్యాలి, మినీ టీచర్స్ కు పెంచిన వేతనం అమలు ఎందుకు చేయటం లేదునీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ రాష్టంలో అంగన్వాడీ టీచెర్స్ & హెల్పర్స్ కు కనీస వేతనం 18 వేలు ఇస్తామన్న హామీ అమలు చేయలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం కొత్తగూడెం ఐడిఓసి కార్యాలయం ఎదుట జరిగిన అంగన్వాడీ కార్యకర్తల ధర్నాలో పాల్గోని మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలు బలోపేతంకు అధిక నిధులు కేటాయింపులు చెయ్యాలి అని పక్కా భవనాలు విద్యుత్, మరుగు దొడ్లు, త్రాగునీరు, అట బొమ్మలు, రూమ్స్ లో రంగులు, ఏర్పాటు చేసి అంగన్వాడీ కేంద్రాలు అభివృద్ధి చెయ్యాలని అన్నారు. 

ఇంటి అద్దెలు, గ్యాస్ బిల్స్, ఇతర పెండింగ్ బిల్స్, మినీ టీచర్స్ పదోన్నతి ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాత జీతం 7,500 నుండి 13,650 రూపాయలు పెంచి అమలు పర్చకుండా గత 9 నెలలు నుండి మినీ టీచర్ గౌరవ వేతనం మాత్రమే అందిస్తున్నారని అన్నారుతక్షణం అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమస్యలు ప్రభుత్వం సానుభూతితో ఆలోచనతో పెండింగ్ మినీ టీచర్స్ వేతనాలు అందించాలని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఐసిడిఎస్ కు నిధులు పెంచాలని అంగన్వాడీ సెంటర్స్ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు పెంచాలని ఖాళీగా ఉన్న ఆయా టీచర్ పోస్ట్ లు భర్తీ చెయ్యాలి. మెనూ ఛార్జీలు పెరుగుతున్న ధరలు ప్రకారం పెంచాలి, ఎన్నికల డ్యూటీలు రద్దు చెయ్యాలి, 5జి సెల్ ఫోన్ లు ఇవ్వాలి, గ్రాడ్యూటీ 15 లక్షలు, పెన్షన్ సదుపాయం, బీమా 15 లక్షలు, హెల్త్ కార్డులు ఇవ్వాలి, ప్రతి నెల నూనె, పప్పులు, గుడ్లు, నాణ్యమైనవి అందించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేశారు.

పై  అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దృష్టికి తీసుకువెళ్తా అని హామీ ఇచ్చారు, ఈ ధర్నా వద్దకు వచ్చి సమస్యలను పరిస్కారం కోసం ప్రభుత్వ పెద్దలకు తెలియజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్, జిల్లా అధ్యక్షులు కంచెర్ల జమలయ్య, అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గొనె మణి, కార్యదర్శి రెడ్డి అరుణ, నాయకులు భూక్యా లలిత, వేల్పుల మల్లికార్జన్, బండి నాగేశ్వర రావు, అన్నరపు వేంకేటేశ్వర్లు, వెంకట్రావు, నిమ్మల రాంబాబు, విజయ, వినోద, శ్రీ లత, సరోజ, ఇంద్ర, నాగలక్ష్మి, సావిత్రి, సంధ్య, మాదవి, రమాదేవి, విజయ లక్మి, సునీత, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.