calender_icon.png 26 December, 2024 | 8:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొప్ప సమరయోధుడు పాపన్నగౌడ్

03-11-2024 01:49:10 AM

  1. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి 
  2. పెనుబల్లిలో పాపన్న విగ్రహావిష్కరణ

ఖమ్మం, నవంబర్ 2 (విజయక్రాంతి): సర్వాయి పాపన్నగౌడ్ గొప్ప సమరయోధుడు, దేశ భక్తుడని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు. పెనుబల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని శనివారం సినీనటుడు సుమన్‌తో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాపన్న పోరాట చరిత్రను వివరించారు.

ఆయన చరి త్ర నేటి తరానికి, రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకం అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి తో ముందుకు పోవాలన్నారు. నియోజకవర్గంలో గౌడ కులస్థుల సమస్యల పరిష్కా రానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సినీ నటుడు సుమన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. కార్యక్రమంలో బాగం నీరజ, దోమ ఆనంద్,  సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ తోట సుజాల రాణి, గౌడ సంఘం నాయకులు   పాల్గొన్నారు.