calender_icon.png 15 November, 2024 | 3:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘మహా’ బాట.. మాటకు మాట

10-11-2024 01:48:41 AM

కాంగ్రెస్, బీజేపీ మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. అయితే, ఇదంతా తెలంగాణ రాజకీయాల్లో కాదు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో ముంభై వెళ్లిన రేవంత్.. ప్రధాని మోదీ అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. నిన్నా మొన్నటి వరకు బడే భాయ్.. చోటా భాయ్ అంటూ పిల్చుకున్న వీరిద్దరూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటుండటంతో జనం ముక్కున వేలేసుకుంటున్నారు.

గతంలోతెలంగాణ గ్యారెంటీలు ఉత్తుత్తివే అని మోదీ సోషల్ మీడియాలో చేసిన పోస్టుపై రేవంత్ కౌంటర్ ఇచ్చారు. దీంతో మోదీ తన పోస్టును డిలీట్ చేశారంటూ పైచేయి సాధించారు. తాజాగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ మాట్లాడుతూ.. మోదీ అబద్ధాలు చెప్పడం మానకపోతే, తాము నిజాలు చెప్తూనే ఉంటామని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో అన్ని హామీలను విజయవంతంగా  అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చిన రేవంత్.. మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ గ్యారెంటీకి తాను హామీ అన్నట్టుగా ప్రసంగించడం ఎన్డీఏ పక్షాలకు మింగుడుపడని పరిస్థితిని మిగిలుస్తోంది.

సాక్షాత్తు ప్రధానిపై తెలంగాణ సీఎం కౌంటర్లు వేస్తుంటే కనీసం వాటిపై కచ్చితమైన ఆధారాలతో స్పందించాల్సిన స్థానిక బీజేపీ నేతలు ఏం చేస్తున్నారని ఆ పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. సరైన కౌంటర్ ఇవ్వకుంటే గ్యారెంటీలు, హామీలు సక్రమంగానే అమలు చేస్తున్నట్టు ఒప్పుకొన్నట్టేనని బీజేపీ శ్రేణులే అంటుండటం గమనార్హం.