13-04-2025 01:47:56 AM
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
వనజీవి రామయ్య మృతిపట్ల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఇంటిపేరును వనజీవిగా మార్చుకొని పర్యావరణ పరిరక్షణకు జీవితాన్ని అంకి తం చేసిన.. పద్మశ్రీ రామయ్య ఎంతో గొ ప్ప వ్యక్తి అని కొనియాడారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను చేరుకొనే క్రమం లో వనజీవి రామయ్య జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు.
భవిష్యత్ తరాలకు భవ్యమైన జీవితాన్ని అందించే లక్ష్యం తో కోటికి పైగా మొక్కలు నాటిన వారి కర్తృత్వం చిరస్మరణీయమని తెలిపా రు. వనజీవి రామయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యుల కు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.