calender_icon.png 19 April, 2025 | 11:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొప్ప మానవత మూర్తులు ఫూలే దంపతులు

16-04-2025 12:36:07 AM

మాజీ రాజ్యసభ సభ్యుడు వీ.హనుమంతరావు

ముషీరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): గొప్ప మానవత మూర్తులు మహాత్మ జ్యోతి రావు ఫూలే, సావిత్రి బాయి ఫూలేలు అని మాజీ రాజ్య సభ సభ్యులు వి. హనుమంతరావు, తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజు గౌడ్, ఫూలే దంపతుల విగ్ర హాల వ్యవస్థాపక చైర్మన్ అయిలి వెంకన్న గౌడ్, బీసీ మేధావుల ఫోరం చైర్మన్ చిరంజీవులు అన్నారు. ఈ మేరకు  మంగళవారం జ్యోతి బాఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలను ప్రతిష్టించి  పూల మాలాలు వేసి ఘనంగా  నివాళులర్పించారు.

అనంతరం చిక్కడపల్లిలోని సమన్వయ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా  సమా వేశంలో వారు మాట్లాడుతూ ప్రతి మండల కేంద్రంలో ఫూలే దంపతుల విగ్రహాలను నెలకొల్పుతామని చెప్పారు. ఫూలే దంపతుల పోరాటం వల్లనే బలహీన వర్గాల వారి కి విద్య అందుబాటులోకి వస్తుందన్నారు. వారిని స్పూర్తిగా తీసుకొని బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు మేకపోతుల నరేందర్ గౌడ్, సుధగాని హరిశం కర్ గౌడ్, జాతీయ బీసీ మేధావుల పురం అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ, యేలికట్టే విజయకుమార్ గౌడ్, ఎంవి. రమణ, అంబాల నారాయణ గౌడ్, దుర్గయ్య గౌడ్, నగేష్, ఎర్ర శ్రీహరి, ఒంగు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.