12-04-2025 06:10:11 PM
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబు..
హుజురాబాద్ (విజయక్రాంతి): దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి పీవీ నరసింహారావు అని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబు అన్నారు. పీవీ సేవాసమితి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని సైదాపూర్ రోడ్డులో మౌనముని పీవీ నరసింహారావు విగ్రహ ప్రతిష్టాపానికి ఓడితల ప్రణవ్ బాబుని ఆహ్వానించేందుకు శనివారం హైదరాబాదులోని తన నివాసంలో పీవీ సేవాసమితి వారు కలిసి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్ములు మహనీయుల ప్రతిమ రూపంలో ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమని అన్నారు. సమాజానికి అత్యుత్తమ సేవలు అందించిన వారిలో పీవీ నరసింహారావు ఒకరని, మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం వలన వర్ధమాన, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా ఉంటాయన్నారు. విగ్రహ ఏర్పాటుకు తన పూర్తి సంపూర్ణ సహకారం ఉంటుందని వారికి హామీ ఇచ్చారు. టీవీ విగ్రహ ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంస్థలను ప్రణవ్ బాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో పీవీ సేవా సమితి అధ్యక్షులు తూము వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తోట రాజేంద్రప్రసాద్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మనోజ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.