14-04-2025 12:45:40 AM
ఏప్రిల్ 13 (విజయ క్రాంతి): పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అన్నారు శ్రీశ్రీ. ఆచరణలో అదే వాస్తవం అయిం ది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లోని కేటీపీఎస్ 5 6 దశల నుంచి అక్రమంగా రవాణా అవుతున్న బూడద తరలింపు ఎట్టకేలకు నిలిచిపోయింది.
కోర్టు ఆదేశాలను వక్రీకరించి, రాజకీయ నాయకుల ఒత్తిడికి తలఒగ్గి అధికారులు బూడిద తరలింపు సేల్ ఆర్డర్ను ముగ్గురికి మాత్రమే కట్టపెట్టారు. దీంతో ఆగ్రహించిన గిరిజన సంఘాల నాయకులు పోరాటాన్ని ఉదృతం చేశారు. ఒకవైపు జెనకో అధికారుల తప్పిదాలను ఎండగడుతూ విజయక్రాంతి వరస కథనాలు ప్రచురించడం, మరోవైపు గిరిజన సంఘాల నాయకులు ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు చేయడంతో పాటు, ప్రత్యక్ష ఆందోళనకు దిగారు.
దీంతో శనివారం నుంచి బూడిద చెరువు నుంచి, సైలోల నుంచి బూడిద తరలింపును జన్కో అధికారులు నిలిపివేశారు. ఒకవైపు అక్రమ మార్గంలో సేల్ ఆర్డర్ పొంది బూడిదను తరలించడమే కాకుండా, మరోవైపు రాజకీయ,అధికార పార్టీ అండదండలతో నిర్ణీత కాలం పూర్తయిన యదేచ్చగా బూడిదను అక్రమంగా తరలిస్తూ అక్రమాలకు పాల్పడ్డారు. అంతిమంగా గిరిజన సంఘాల నాయకుల పోరాటంతో అక్రమ బూడిద తరలింపుకు బ్రేక్ పడింది.