06-04-2025 05:37:30 PM
తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని శ్రీ శబరిమాత ఆలయంలో ఆదివారం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. అశేష భక్త జనాల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్యన శ్రీ సీతారాముల వారి కళ్యాణ నిర్వహించారు. కళ్యాణం జరుగుతున్నంత సేపు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు.
అంతకుముందు భక్తులు శ్రీ శబరిమాత ఆలయంలో శ్రీ శబరిమాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కె మదన్మోహన్ రావు హాజరై కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు ఆశ్రమ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక అన్నదానం ఏర్పాటు చేశారు. మండలములోని ఎర్రపహాడ్ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఆవరణలో శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మద్ది మహేందర్ రెడ్డి, శ్యామ్ రావు, సంజీవులు, శ్రీను, రామ శంకర్, బాల్ కిషన్ రావు, పండరి, విట్టల్ రెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.