calender_icon.png 7 April, 2025 | 5:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళ్యాణం.. కమనీయం..

06-04-2025 04:43:39 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సీతారాముల కళ్యాణం మహోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీకోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణం ఆదివారం కన్నుల పండువగా జరిగింది. ఈ వేడుకలను భక్తులు నేత్రపర్వంగా తిలకించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాములోరి పెళ్లి వేడుకలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థలు భక్తులకు తాగునీరు, అంబలి, మజ్జిగ పంపిన స్టాళ్లను ఏర్పాటు చేసి సేవలు అందించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. వివాహ వేదిక వద్ద బారికెట్లూ ఏర్పాటుచేసి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేశారు.

బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ ఆధ్వర్యంలో కల్యాణ వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు కట్టుదిట్టమైన రక్షణ పరమైన ఏర్పాట్లు చేశారు. బెల్లంపల్లి టూ టౌన్ ఎస్ఐ మహేందర్, పోలీస్ సిబ్బంది వివాహ వేదిక వద్ద బందోబస్తూను నిర్వహించారు. వివాహ వేడుక పూజలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ తో పాటు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య, నాయకులు మునిమంద రమేష్, దావ రమేష్, చిలివేరి నర్సింగo పుణ్య దంపతులు పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మద్య కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. శ్రీరామనవమి వేడుకలు పట్టణంలోని రైల్వే స్టేషన్, టేకుల బస్తి, బెల్లంపల్లి బస్తి, నెంబర్ 2 ఇంక్లైన్ బస్తి, షిరిడి సాయిబాబా తదితర ఆలయాల్లో వైభోపేతంగా జరిగాయి. కల్యాణ వేడుకలు అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.