ముషీరాబాద్, జనవరి 15: సంక్రాంతి పర్వదినం సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్‌పూర్ డివిజన్‌లోని బాకారం మళ్లికార్జునస్వామి (మల్లన్న) దేవాలయంలో జరుగుతున్న జాతర మహోత్సవానికి మంగళవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, సరిత దంపతులు హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.ప్రత్యేక పూజలు చేసి మొక్కులను తీర్చుకున్నారు.
ఆలయ ట్రస్టీ నల్లవెల్లి అంజిరెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ నల్లవెల్లి ఊర్మిలా అంజిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ పూజారులు బీఆర్‌ఎస్ గ్రేటర్ నాయకుడు ఎమ్మె శ్రీనివాస్‌రావు, ముఠా జైసింహ, మాజీ చైర్మన్ మాచర్ల పద్మజ, బింగి నవీన్, వై.శ్రీనివాస్ రావు, వల్లాల శ్యామ్ యాదవ్, శ్రీధర్ రెడ్డి, ముచ్చకుర్తి ప్రభాకర్, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.