అలంపూర్, నవంబర్ 13 : ఓటరు జాబితా తారుమారైందని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో బుధ వారం ‘ఉపాధిహామీ’ సామాజిక తనిఖీ కోసం వచ్చిన అధికారులను ప్రజలు నిలదీశారు. అలంపూర్ పరిధిలోని బోరవెల్లిలో నిర్వహించిన గ్రామసభకు ప్రత్యేకాధికారి సక్రియానాయక్, ఎంపీడీవో భాస్కర్ హాజ రవగా.. నాలుగు నెలలుగా ఓటరు జాబితా అంశంపై విన్నవించిన్నా ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. ఈ విషయమై కలెక్టర్ నివేదిక కోరారని, ఉపాధి పనుల సామాజిక తనిఖీ ఉన్నందున ఆలస్యమవుతున్నదని గ్రామస్తులకు ఎంపీడీవో వివరించారు.