రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
ఆదిలాబాద్, మే 11 విజయక్రాంతి: ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. దిలావార్‌పూర్ వరి కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తూకపు యంత్రాలు, ప్యాడీ క్లీనింగ్ యంత్రాలు, తేమ యంత్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. అనంతరం దిలావార్ పూర్ ఉన్నత పాఠశాలలోని 282, 288 నంబర్ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..దాన్యం కొనుగోలు ప్రక్రియ నిరంతరం జరగాలని ఆదేశించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
రైతులు ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు తాగునీరు, టెంట్లు ఉండేలా చూడాలని, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పారు. అకాల వర్షాలు కురు స్తున్నందున రైతులకు సరిపడినన్ని టార్పాలిన్లను, గన్నీ బ్యాగ్స్ అందుబాటులో ఉంచాలని సూచించారు. ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే సకాలంలో మిల్లులకు పంపాలని ఆదేశించారు. అవసరమైతే ధాన్యం తరలింపునకు అదనపు లారీలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో సివిల్ సప్లయిస్ డీఎం శ్రీకళ, తహసీల్దార్ స్వాతి, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.