calender_icon.png 29 April, 2025 | 8:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

29-04-2025 12:00:00 AM

తుర్కయంజాల్, (ఏప్రిల్ 28): ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియో గం చేసుకోవాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పిలుపునిచ్చారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి తొర్రూ రులో జిల్లా సహకార మార్కెట్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మల్రెడ్డి రంగారెడ్డి ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి రకం వరి ధాన్యానికి రూ.2320+500, సాధారణ రకానికి రూ.2300గా ప్రభుత్వం మద్దతు ధరను నిర్ణయించిందన్నారు. రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామన్నారు. ఎట్టి పరిస్థితిలో వరి ధాన్యం దళారుల చేతుల్లోకి వెళ్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

ధాన్యం సేకరణ విషయంలో నగ దు చెల్లింపు మూడు రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశా లిచ్చిందని మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీ కాబ్ వైస్ చైర్మన్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కర్ చారి, మాజీ ఎంపీపీ మల్రెడ్డి యాదిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చామ కృష్ణారెడ్డి, మాజీ కౌన్సిలర్ నక్క శివలింగం గౌడ్, నాయకులు ముత్యాల రాజశేఖర్, సంరెడ్డి బల్వంత్రెడ్డి, అనిల్రెడ్డి, వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, డీసీఎంఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.