మండె వీర హనుమంతరావు...
భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన రూ.3 కోట్ల విలువ గల ధాన్యం బోనస్ రైతుల ఖాతాలో జమ చేసామనీ కొత్తగూడెం(PACS) కార్యలయంలో సొసైటి చైర్మన్ మండె వీరహనుమంతరావు తెలిపారు. గురువారం ఆయన అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగినది. ఈ సందర్బంగా సొసైటి చైర్మన్ మండె వీరహనుమంతరావు మాట్లాడుతూ.. కొత్తగూడెం సొసైటి ద్వార నాలుగు మండలాలో 12 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వార 1,120 మంది రైతుల వద్ద నుండి 60,000 క్వింటాళ్ల సన్నరకం ధాన్యం కొనుగోలు చేసామన్నారు. అట్టి ధాన్యంనకు సంబందించి ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ 2320/ ల చోప్పున సుమారు 14 కొట్ల రూపాయలను రైతుల ఖాతలో జమచేయటం జరిగింది.
అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సన్నరకం ధాన్యంనకు ఇచ్చే బోనస్ క్వింటాకు రూ.500/- రూపాయల చోప్పున బోనస్ మొత్తం 3 కోట్ల రూపాయలను కూడా రైతుల ఖాతలో జమచేయటం జరినది అని, రైతులకు బోనస్ చెల్లించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులైన శ్రీ రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులైన శ్రీ మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరవుకు రైతుల తరుపున, సొసైటి తరపున ధన్యవాదములు తెలిపారు. అలాగే ఇటివల ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ నిధులు కూడా సంఘ రైతుల ఖాతలో జమచేయటం జరిగినది, అట్టి రైతులకు రుణాలు కూడా ఇవ్వటం జరుగుతుందని తెలియజేసారు.
కొత్తగూడెం సంఘంను పునర్విభజన చేయుటకు గాను కార్యవర్గం సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానము చేసారు. ఈ కార్యక్రమంలో సొసైటి ఉపాధ్యక్షులు కూచిపూడి జగన్నాధరావు, సొసైటి డైరెక్టర్లు గుగులోతు చందర్, శ్రీమతి తిట్ల విజయకూమారి, పోటువెంకటేశ్వర రావు, శ్రీమతి గుగులోతు విజయ, కంటెం సత్యనారాయణ సంఘ సెక్రటరి పండ్ల సారయ్య పాల్గోన్నారు.