తలకొండపల్లి (విజయక్రాంతి): మండలంలోని గట్టుఇప్పలపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన జిపిఎల్ సీజన్-5 క్రికెట్ పోటీలు గురువారం ముగిసాయి. పోటీలలో విజయం సాధించిన లెజెండ్ టీం, రన్నరప్ గా నిలిచిన ఆరేంజ్ ఆర్మీ జట్లకు నిర్వాహకులు బహుమతులను ప్రధానం చేశారు. వక్తలు మాట్లాడుతూ.. పండుగల సందర్భంగా గ్రామాలలో ఇలాంటి ఆటల పోటీలు నిర్వహిస్తే యువకుల మధ్య స్నేహభావం పెంపొందుతాయని అన్నారు. ఆటల పోటీల నిర్వహణకు ఆర్థిక సాయం అందజేస్తున్న దాతలందరిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ టి.శ్రీదర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎదుల రాజు, చంద్రశేఖర్ రెడ్డి, డేవిడ్, రేన్ రెడ్డ, శరత్ చంద్ర, శెట్టి రాజశేఖర్, కోలా రమేష్, బొడ్డె కిషన్, సామాల కుమార్, సాయిబాబ తదితరులు పాల్గొన్నారు.