12-03-2025 12:27:43 AM
ములుగు, మార్చి 11 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో మంగళవారం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటనలో భాగంగా మేడారం శ్రీ సమ్మక్క - సారలమ్మకు, నిలువెత్తు బంగారం సమర్పించి, అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రి సీతక్క, శ్రీ సమ్మక్క సారలమ్మల ప్రా శస్త్యం గురించీ గవర్నర్‌కి వివరించారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో గవర్నర్ మాట్లాడుతూ.. ములుగు జిల్లాలోని తాడ్వా యి మండలం కొండపర్తి, గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగిందని, గ్రామం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, పాఠశాల వాతావరణం అంతర్గత రోడ్లు నిర్మాణం అన్ని మౌలిక వసతుల కల్పన కొసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర, టీ మంత్రి సీతక్క, ఎస్పీ శబరీష్, సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.