calender_icon.png 3 April, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్కారుది చేతకానితనం

02-04-2025 12:22:26 AM

-యూనివర్సిటీ భూములు అమ్మడం దారుణం రాజేంద్రనగర్ బీజేపీ కంటెస్టడ్ ఎమ్మెల్యే అభ్యర్థి తోకల శ్రీనివాస్‌రెడ్డి 

రాజేంద్రనగర్, ఏప్రిల్‌౧ (విజయ క్రాంతి): కాంగ్రెస్ సర్కారుది చేతకాని తనమని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మడం దారుణమని రాజేంద్రనగర్ బిజెపి కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో బిజెపి నేతలు అక్కడికి వెళ్తారనే ఉద్దేశంతో ముందస్తుగా పోలీసులు శ్రీనివాస్ రెడ్డిని మైలార్దేవ్ పల్లి లోని ఆయన నివాసంలో హౌస్  అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెచ్ సియూ భూములపై టీజీఐఐసి ఆధ్వర్యంలో  పోలీసుల సమక్షంలో రాత్రింబవళ్ళు అడవిని చదను చేస్తున్నారని ఆరోపించారు. అరుదైన జంతువృక్ష సంపదను కొల్లగొట్టడం సరికాదన్నారు. జెసిబి లు నలువైపులా చుట్టుముట్టి  అడవిని నామరూపాలు లేకుండా చేయడం దారుణమని తీరుస్తాయిలో మండిపడ్డారు.సర్కారు వేల కోట్ల విలువైన భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు కుట్రలు పన్ను అవుతుందని విమర్శించారు.

సీఎం రేవంత్ రెడ్డి అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం నడపడానికి యూనివర్సిటీ భూమి అమ్ముకోవడం దిగజారుడు తనమన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో తీవ్రస్థాయిలో ఆందోళన చేపడుతామన్నారు. యూనివర్సిటీ భూములను అమ్ముకోకుండా బిజెపి అడ్డుపడుతుందన్నారు. కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలను విస్మరించి అడ్డగోలుగా పాలన చేస్తుందని విమర్శించారు.