26-04-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
జహీరాబాద్, ఏప్రిల్ 25 : రాష్ట్రంలోని రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. శుక్రవారం ఝరాసంగం మండల కేంద్రంలో రైతు వేదిక లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కొనింటి మాణిక్యరావు, తెలంగాణ రాష్ట్ర సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంపై రైతులు పరిపూర్ణమైన అవగాహన ఏర్పరచుకోవాలని కలెక్టర్ సూచించారు ఈ చట్టంలోని అంశాలపై గ్రామాలలో విస్తృతంగా చర్చిస్తూ తోటి రైతులకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహ్లీ, జరాసంగం, న్యాల్కల్ మండలాల్లో భూ భారతీయ చట్టం అవగాహన సదస్సులలో అదనపు కలెక్టర్ మాధురితో కలిసి పాల్గొన్నారు. చట్టంలో రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా చట్టం తీసుకురావడం జరిగిందని ఆమె వివరించారు. ఎమ్మెల్యే మాణిక్యరావు మాట్లాడుతూ భూభారతి చట్టంలోని ప్రతి అంశాన్ని ప్రజలకు చెప్పాలని, దీనిద్వారా రైతుల సమస్యలను సక్రమంగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రాంరెడ్డి, తహసిల్దారు బాలశంకర్, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, నాయకులు వెంకటేశం, నర్సింహా గౌడ్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.