calender_icon.png 2 April, 2025 | 3:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం

26-03-2025 01:26:47 AM

కుత్బుల్లాపూర్,మార్చ్ 25(విజయ క్రాంతి):పేద ప్రజలకు సంక్షేమ పథకాలు, అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ అన్నారు.కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ లోని తన నివాసంలో నియోజకవర్గానికి చెందిన ప్రజలను మంగళవారం కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన సమస్యలను ప్రశీకరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పలు శుభకార్యాలకు, కార్యక్రమాలకు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ప్రజలు, సంక్షేమ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు.