calender_icon.png 16 April, 2025 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

16-04-2025 12:57:49 AM

  1. సీఎం, మంత్రుల చిత్ర పటాలకు క్షీరాభిషేకం
  2. కార్యకర్తల సంబురాలు 

ఖమ్మం, ఏప్రిల్ 15 ( విజయక్రాంతి ):-అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలనేవి ప్రభుత్వ సంకల్పమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ స్పష్టం చేశారు.

మంగళవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క హామీను నెరవేరుస్తూ కాంగ్రెస్ అంటేనే ప్రజా ప్రభుత్వం అని నిరూపిస్తున్న ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు,మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుకు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర మంత్రి మండలి సభ్యులు అందరికి ఖమ్మం కాంగ్రెస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ , వారి చిత్ర పటాలకు పాలాభిషేకంచేసి,మిఠాయిలు పంచి బాణాసంచా కాల్చి సంబురాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, జిల్లా ఎస్సీ సెల్ అద్యక్షులు బొడ్డు బొందయ్య మాట్లాడుతూ ఎన్నోసంవత్సరాలుగా పేరుకుపోయిన ఎస్సీ వర్గీకరణ,ధరణి సమస్యలను కాంగ్రెస్ చేవెళ్ల డిక్లరేషన్ లో ఇచ్చిన మాట ప్రకారం డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి రోజున జీవో విడుదల చేసి మాదిగ, మాదిగ ఉపకులాలకు,రైతులకు కాంగ్రెస్ న్యాయం చేసిందన్నారు.

పేద భూమికి హక్కు పై భరోసా ఇస్తూ& భూ భారతి కి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. ఇవ్వన్నీ చూసి ఓర్వలేక బిజెపి, బీఆర్‌ఎస్ పార్టీలు కాంగ్రెస్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. కార్యక్రమం లో పార్టీ, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.