21-03-2025 12:31:49 AM
దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
దేవరకద్ర మార్చి 20 : అందరి సంక్షేమ కోసం ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వము వాస్తవ పరిస్థితులను అందరికీ తెలియజేస్తూ ఒక కుటుంబంలో ప్రతి అంశాన్ని ప్రజలకు తెలియజేస్తుందని పేర్కొన్నారు. అన్ని విషయాలను అవగతం చేసుకుంటూ ప్రభుత్వానికి అండగా నిలవాలని తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను అందించడం ద్వారా నిరుపేదల ఇండ్ల శుభకార్యాలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. మునుముందు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.