12-04-2025 01:26:46 AM
స్త్రీ, శిశు, గర్భిణుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క
మహబూబాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి):ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం మహి ళల ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. శుక్రవారం మహబూ బాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంజే డు గ్రామంలో రేషన్ కార్డుదారుడు సిరబోయిన క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులు, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అటవీ శాఖ అధికారి విశాల్, తదితరులతో కలిసి మంత్రి సీతక్క సన్న బియ్యంతో వండిన భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజలకు మహిళలకు అన్ని వర్గాల ప్రజలకు చేదోడు, వాదోడుగా ఉంటున్న దన్నారు.
ప్రతి పేదవాడి ఆకలి తీర్చేందుకు ఈ సన్న బియ్యం పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కొత్తగూడ మండలం గాంధీనగర్ అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించి సామూహిక శ్రీమంతా లు, అక్షర అభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. చేశారూ. అనంతరం కొత్తగూడ, గంగారం మండలాలతో పాటు జిల్లా అభివృద్ధిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అటవీ శాఖ అధికారి విశాల్, రెవెన్యూ డివిజన్ అధికారి కృష్ణవేణి, డిడబ్ల్యుఓ ధనమ్మ, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, స్థానిక తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీవో రవీంద్ర ప్రసాద్, డిఎస్‌ఓ ప్రేమ్ కుమార్, డిఎం సివిల్ సప్లై కృష్ణవేణి, మండల ప్రత్యేక అధికారి వేముల సురేష్, జిల్లా అధికారులు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.