calender_icon.png 26 March, 2025 | 7:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

24-03-2025 12:00:00 AM

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 

ఎం.అరవింద్‌కుమార్ యాదవ్

ముషీరాబాద్, మార్చి 23: (విజయక్రాంతి): ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమ ని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అరవింద్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం భోలక్ పూర్ డివిజన్లోని  సిద్ధిక్ నగర్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సయ్యద్ మసూద్ ఆధ్వర్యంలో పలువురు మైనార్టీ కాంగ్రెస్ నేతలు అరవింద్ కుమార్ యాదవ్ ను కలిసి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను వివరిం చారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

ఈ సందర్భంగా అరవింద్ కుమార్ యాదవ్  మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. 6 గ్యారంటీల అమలుకు అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం  చేసుకునేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ భోలక్ పూర్ డివిజన్ అధ్యక్షుడు బషీరుద్దీన్, నాయకులు అల్లాఉద్దీన్, ఉస్మాన్ ఖైరత్ అలీ బాబా   పాల్గొన్నారు.