calender_icon.png 22 March, 2025 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే డాక్టర్‌సంజీవరెడ్డి

21-03-2025 12:35:57 AM

నారాయణఖేడ్,మార్చి 20: నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి గురువారం భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా మానూరు మండల పరిధిలోని గట్టు లింగంపల్లి బొరంచ, దూదగొండ, రుద్రారం గ్రామాలకు సంబంధించి రూ 3.5 కోట్లతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. దుద గొండలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. తుమ్నూరు గ్రామపంచాయతీ పరిధిలో ఎనిమిది లక్షల రూపాయలతో ఫార్మేషన్ రోడ్డుకు భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు.

నారాయణఖేడ్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులను 173 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత తమ ప్రభుత్వానికి చెందుతుందని అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గ్రామాలకు సంబంధించిన రోడ్లు పట్టించుకోలేదని అన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు దిగంబర్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, రాజు, శంకర్ సెట్, తాహెర్ అలీ, పండరి రెడ్డి, బణపురం రాజు, ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.