calender_icon.png 19 April, 2025 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదోళ్లు సన్నబియ్యం తినాలనేదే ప్రభుత్వ లక్ష్యం

10-04-2025 01:38:23 AM

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, ఏప్రిల్ 9(విజయక్రాంతి) :ధనవంతులు తినే బియ్యమే పేదవాళ్ళు తినాల నే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా ఆహార భద్రత కార్డుదారులకు ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్ర మాన్ని ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ రా హుల్ రాజ్   తెలిపారు. బుధవారం టేక్మాల్ మండలం చంద్రు తండాలో లంబాడా సా మాజిక వర్గానికి చెందిన రమావత్  పీరియ ఇంట్లో ప్రభుత్వం అందించిన సన్నబియ్యం భోజనాన్ని వారి కుటుంబ సభ్యులు, ఇతర జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ భోజనం చేశారు.

కలెక్టర్ మాట్లాడుతూ సన్నబియ్యం పంపిణీతో పేదవారి కళ్ళలో ఆనందాన్ని స్వయంగా చూశానని అన్నారు. సన్నబియ్యం లబ్దిదారుని  కు టుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందని, సం తృప్తి ఇచ్చిందనిఅన్నారు. అనంతరం కలెక్టర్ రమావత్  పీరియ  కుటుంబ సభ్యులకు శాలువా బహుకరించి స్వీట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో  జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, తహసిల్దార్ తులసిరాం, ఎంపీడీవో విటల్ తదితరులుపాల్గొన్నారు.