04-04-2025 01:17:32 AM
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నల్లగొండ, ఏప్రిల్ 3 (విజయక్రాంతి) : రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. కేతేపల్లి, నకిరేకల్ మండలాల్లోని పలు గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ప్రారంభించి ఆయన మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించేందుకు అన్న చర్యలు తీసుకుంటున్నామన్నారు.
నకిరేకల్ నియోజకవర్గంలో 25 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా టెంట్లు, తాగునీరు, విద్యుత్ సౌక ర్యం కల్పించాలని చెప్పారు. రైతులు దళారులను నమ్మిపోకుండా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలని సూచించారు.