calender_icon.png 20 November, 2024 | 9:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

20-11-2024 02:26:47 AM

జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

కామారెడ్డి, నవంబర్ 19 (విజయక్రాంతి): రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేట విండో ఆధ్వర్యంలో నిర్మించిన ఫంక్షన్‌హాల్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. నిజాంసాగర్ మండలం మాజీ గ్రామంలో రైతు శిక్షణ కేంద్రం సమావేశ గదితో పాటు కల్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహకార సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేయడం అసాధ్యమని గత ప్రభుత్వం చెప్పిన అంశాన్ని సుసాధ్యం చేసిన ప్రజాప్రభుత్వం తమదన్నారు.

ఈ కార్యక్రమంలో అచ్చంపేట సొసైటీ చైర్మన్ నాగిరెడ్డి, మార్కెట్  కమిటీ చైర్మన్ మనోజ్‌పటేల్, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్, సాయిరెడ్డి, వెంకట్, రాంరెడ్డి, ఆదిల్, సాయినాథ్, మల్లికార్జున్ పాల్గొన్నారు.