మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హుజూర్‌నగర్, జనవరి 12: అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కు మార్‌రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మండల పరిధిలో రూ.18.58 కోట్ల అభివృద్ధి పనులకు కలెక్టర్ తేజస్‌నందలాల్ పవార్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. నేరేడుచర్ల మున్సిపాలిటీలో రోడ్డు నిర్మాణానికి, జాన్‌పహడ్ సీసీరోడ్ల నిర్మాణానికి, డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం మసీద్‌లో ముస్లిం ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. నేరేడుచర్లలో షాదీఖానా నిర్మాణానికి రూ.75 లక్షల మం జూరు చేస్తూ స్థలం సేకరించాలని అధికారులకు మంత్రి సూచించారు. దిర్శించర్లలో బాప్టిస్ట్ చర్చిలో మంత్రి మాట్లాడుతూ.. క్రైస్తవ మతపెద్దలను కలవడం సంతోషంగా ఉన్నదన్నారు. దిర్శించర్ల నుంచి ముత్యాలమ్మ కుంట వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
నేరేడుచర్ల పరిధిలోని శాంతినగర్, కమలానగర్‌లో సీసీరోడ్ల నిర్మాణానికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శంకుస్థా పన చేశారు. హుజూర్ నగర్, కోదాడ ప్రజల అభిమానం, ఆప్యాయతలతో ఈ ప్రాంతాల అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానని చెప్పారు.
అనంతరం కల్లూరులో కబడ్డీ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమాల్లో హుజూర్‌నగర్ ఇన్‌చార్జ్ ఆర్డీవో సూర్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ బచ్చలకూరి ప్రకాశ్, వైస్ చైర్‌పర్సన్ అలక సరితసైదిరెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ సీతారామయ్య, కమిషనర్ అశోక్‌రెడ్డి, తహసీల్దార్ సైదులు, మార్కెట్ కమిటీ చైర్మన్ బెల్లంకొండ విజయలక్ష్మి, గెల్లి రవి, ఎడ్ల విజయ్, బాల్దూరి సందీప్ పాల్గొన్నారు.