24-03-2025 01:09:45 AM
బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్
బెల్లంపల్లి, మార్చి 23 : ప్రజా సంక్షేమం పైనే రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టిందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. ఆదివారం బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
ముందుగా వేమనపల్లి మండలంలో ని చామనపల్లి, కృష్ణ పల్లి గ్రామాల మధ్యలో రూ 1.93 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు ఆయన లాంచనంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజల పక్షాన నిలుస్తుందన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రణాళికబద్ధంగా కృషి చేస్తుందని చెప్పారు. అనంతరం మండలంలో అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం బెల్లంపల్లి పట్టణంలోని బూడిద బస్తి లో బొడ్రాయి తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
అక్కడినుండి పట్టణంలోని హనుమాన్ బస్తీలో మాజీ కౌన్సిలర్ చిట్యాల మధు తల్లి అనసూయ దశదినకర్మకు హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించారు. బెల్లంపల్లిలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో విద్యార్థినిలకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత కంటి అద్దాలను పంపిణీ చేశారు.
కాంగ్రెస్ నాయకులు బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమర్ సూరిబాబు, రుద్ర బట్ల సంతోష్ కుమార్, సాబీర్ అలీ, గెళ్లి రాయలింగు, మునిమంద రమేష్, లతోపాటు పలువురు మండల పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ అనుబంధ కార్యకర్తలు ఉన్నారు.