10-03-2025 01:32:50 AM
రాష్ర్ట ఎక్సుజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
అచ్చంపేట, మర్చి 9 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం కొరకై ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్మించే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల కొరకై 200 కోట్ల చొప్పున 11 వేల కోట్లు మంజూరు చేసిందని రాష్ర్ట ఎక్సుజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు ఆదివారం అచ్చంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణతో పాటు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల వారికి ఒకే విధమైన ఉన్నత విద్యను ఒకే స్థానంలో అన్ని వసతులు సదుపాయాలతో ఈ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మంజూరైన ఈ నిధులతో ఇప్పటికే సేకరించిన స్థలాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతటి మల్లేష్ మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్, పాల్గొన్నారు.