- తప్పులను కప్పి పుచ్చుకోవడానికే కేటీఆర్ విమర్శలు
- ఆదాయం ఏ అంశాల్లో తగ్గిపోయిందో చెప్పాలి
- టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
కామారెడ్డి, అక్టోబర్22(విజయక్రాంతి): హత్యా రాజకీయాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఉపేక్షించబోదని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. మంగళవారం నిజామాబాద్‌లో విలేకర్ల సమావే శంలో ఆయన మాట్లాడుతూ జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యకార్యకర్త, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిముఖ్య అనుచరుడైన గంగారెడ్డి హత్య ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
హ త్యా రాజకీయాలు తెలంగాణ సాంస్కృతి కాదని అన్నారు. దోషులను తక్షణమే శిక్షించాలని, ఈ విషయంలో పోలీస్‌లతో మా ట్లాడుతానని ఆయన పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ అధికారం కోల్పోయాక తప్పు లను కప్పి పుచ్చుకోవడానికి కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఆదాయం ఏ అంశాల్లో తగ్గిపోయిందో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. సమా వేశంలో నుడా చైర్మన్ కేశవేణు, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పాల్గొన్నారు.