calender_icon.png 18 November, 2024 | 8:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వాన్ని మూసీలో ముంచుతారు!

18-11-2024 01:24:56 AM

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్

ఎల్బీనగర్, నవంబర్ 17: మూసీ పేరుతో పేదల ఇండ్లు కూల్చితే, ప్రజలు ప్రభుత్వాన్ని మూసీ లో ముంచుతారని ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఆదివారం ఉదయం ఆయ న చైతన్యపురి డివిజన్ పరిధిలోని న్యూమారుతినగర్, ఫణిగిరి, సత్యానగర్ కాలనీల్లో పర్యటించారు. మూసీ పరీవాహక ప్రాంతా ల్లో పర్యటించి నిర్వాసితులతో మాట్లాడారు.

అనంతరం ఫణిగిరిలోని సాయిబాబా మందిరంలో నిర్వాసితులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఎంపీ మాట్లాడారు. మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గపు చర్యలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి సీఎం కావడంతోనే పేదలకు గడ్డుకాలం వచ్చిందని అభిప్రాయపడ్డారు. పేదలను ఇబ్బంది పెట్టిన పార్టీలేవీ బాగుపడవని, మట్టికలిసిపోతాయని స్పష్టం చేశారు.

సీఎం రేవంత్‌రెడ్డి పూటకో మాట.. పూటకో హామీ ఇస్తున్నారని విమర్శించారు. ప్రక్షాళన ప్రతిపాదన రాగానే చైతన్యపురి డివిజన్‌లోని మూసీ ప్రాంతంలో 40 ఏండ్ల నుంచి ఉంటున్న నిర్వాసితులోల కలవరం మొదలైందన్నారు. వారికి సీఎం కంటి మీద కునుకు లేకుండా చేశారని దుయ్యబట్టారు. ఇండ్లపై రెడ్‌మార్క్ వేయడంతో ఎంతోమంది అనారోగ్యం పాలయ్యారని, కొందరు ఇప్పటికే దవాఖానల్లో చేరారన్నారు.