07-02-2025 12:58:19 AM
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొం డేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తండేల్’. బన్నీ వాసు నిర్మాత. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్ర మాలూ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలో చిత్రబృందం విలేక రులతో మాట్లాడింది. ఈ సందర్భంగా టికెట్ ధరలపై అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరలు తక్కువగా ఉన్నాయి. అందుకే అక్కడ ధరలను పెంచాలని అడిగాం. తెలంగాణ ప్రభుత్వాన్ని మేం ఏమీ అడగలేదు. అందుకే ఇక్కడ ధరలు రూ.295, రూ. 395 ఉన్నాయి. “తండేల్’కు ఎలాంటి బెనిఫిట్ షోలూ లేవు.
అంత బెనిఫిట్ మాకొద్దు. ఈ సినిమాకు అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చయింది. వాసు, కొంతమంది నా దగ్గరకు వచ్చి ఎందుకైనా మంచిది సినిమాను ఏరియాల వారీగా అమ్మేద్దాం’ అని అడిగారు.
నేను మనమే విడుదల చేద్దాం అన్నాను” అని అరవింద్ చెప్పారు. ఈ మూవీ ఈవెంట్‌కు అల్లు అర్జున్ వస్తే, ఆయన తర్వాతి చిత్రం లుక్ అందరికీ తెలిసిపోతుందనే కారణంతోనే రాలేదా? అనగా “తండేల్’ ఈవెంట్ వరకే పరిమితం చేద్దాం” అంటూ ఆయన సమాధానం దాటవేశారు.