28-04-2025 12:24:45 AM
కామారెడ్డి, ఏప్రిల్ 27 (విజయ క్రాంతి): రాష్ర్ట ప్రభుత్వాలు గీతా కార్మికులకు కులవృత్తిగా తోడ్పాటు అందించడానికి కార్మికులకు జీవనోపాధి కోసం స్వచ్ఛమైన కల్లును గీసి విక్రయాలు జరపాలని నిబంధనల మేరకు అప్పటి ప్రభుత్వం కార్మికులకు లైసెన్సులు కేటాయించింది.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కామారెడ్డి జిల్లాలోనీ పట్టణాలతో పాటు ఆయా గ్రామాల్లో విచ్చలవిడిగా లైసెన్సు లేని, అనుమతులు పొందని దుకాణాలను యదేచ్చగా నడుపుతున్నారు. కొందరు కల్లు ముస్తేదారులు సిండికేట్లుగా మారి టెండర్ లు పాడి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేని కల్తీ కల్లు దుకాణాలు నడుపుతూ ప్రభుత్వానికి వచ్చే ఖజానాకు గండి కొట్టి విక్రయాలు జరిపి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి..
జిల్లాలోని అన్ని మండలాల్లో, గ్రామాల్లో సైతం అనుమతులు లేని కల్తీ కల్లు దుకాణాలు నడుపుతూ ప్రభుత్వంకు వచ్చే ఆదాయాన్ని పెద్ద మొత్తంలో కల్లు విక్రయదారులు సిండికేట్ గా మారి గండి కొడుతున్నారు.
అద్దె ఇండ్లలో కల్తీ కల్లు విక్రయాలు..
ఆయా గ్రామాల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండా కల్తీ కల్లు దుకాణాలు ద్వారా విక్రయాలు జరిపి ప్రభుత్వానికి వచ్చే పెద్ద మొత్తంలో ఆదాయాన్ని కళ్ళు మూస్తే దారులు విక్రయాలు జరిపి ధనార్ధనే ధ్యేయంగా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరింప చేస్తున్నారు.
కల్తీ కల్లు ముస్తేదారులు ఆదాయమే ధ్యేయంగా అద్దె ఇళ్లలో గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలు జరుపుతున్నారు. అధికారులు గత వారం రోజుల క్రితం కామారెడ్డి జిల్లాలో అన్ని గ్రామాల్లో విచ్చలవిడిగా దాడులు నిర్వహించడంతో తోక ముడిసిన కల్లు ముస్తేదారులు వారం రోజులు కాకముందే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే చాందంగా మారింది.
కొత్త రూట్లో కల్లు విక్రయాలు...
గతంలో అనుమతులు లేకుండా కల్లు దుకాణాలను కల్లు విక్రయాలు జరిపిన మూస్తే దారులు, వాటిని వదిలి కొత్త రూట్లో అద్దె ఇండ్లలో కల్లు విక్రయాలు జరుపుతున్నారు. అధికారులు దాడులు చేస్తారని నేపథంతో పక్కా ప్లాన్ తో ఇతర ఇండ్లలో కళ్ళు వికయాలు జరుపు తున్నారు. కల్లు ప్రియులకు కల్లును ఉదయం పూటనే కావలసిన వారికి ఇంటికే పార్సిల్ పంపుతు న్నారు. మొత్తానికి ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి డబ్బే సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాలను బేకాతర్ చేస్తున్న కల్లు మూస్తేదారు..
తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం కామారెడ్డి జిల్లాలో జరుగుతున్న వరుస కల్తీకల్లు సంఘటనలను దృష్టిలో ఉంచుకొని రాష్ర్ట వ్యా ప్తంగా సంబంధిత అధికారులతో హుటా హుటిన సమావేశం ఏర్పాటు చేసిన సంగతి విషయం తెలిసిందే. కల్తీ కల్లును అరికట్టి స్వచ్ఛమైన కల్లును అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారు లకు ఆదేశాలు జారీ చేశారు. పాత సీసాలో కొత్తనీరు లాగా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఆచరణలో పెట్టని అధికారులు పాత పాటనే పాడుతున్నారు. జిల్లాలోని కల్తీ కల్లు దందాకు చేక్ వలసిన అవసరం ఎంతైనా ఉంది.
అధికారుల అండతోనే అనుమతులు లేని కల్తీ కల్లు విక్రయాలు..
కామారెడ్డి జిల్లాలో ఎక్సుజ్ అధికారుల అండతోనే అనుమతులు లేని కల్తీకల్లు దుకాణాలు ద్వారా జోరుగా విక్రయాలు ఊపం దుకున్నాయి. ఎక్సుజ్ అధికారులకు కల్తీకల్లు విక్రయదారులు సమర్పించుకోవడంతోనే అక్రమ కల్తీ కళ్ళు దందా జోరు కొనసాగుతుంది. కల్తీని, అనుమతులు లేని దుకాణా లను నిలువరించాల్సిన ఎక్సుజ్ అధికారులు అటువైపు చూసి చూడని విధంగా వ్యవహరించడంతోనే ఈ దందా కొనసాగుతుంది. ఇకనైనా జిల్లా, రాష్ర్ట శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని, అక్రమ విక్రయాలకు సహకరిస్తున్న అధికారులపై సైతం చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.