calender_icon.png 20 March, 2025 | 9:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాల జాతులను దెబ్బతీసిన ప్రభుత్వాన్ని బొంద పెట్టాలి

20-03-2025 12:00:00 AM

  • మాల మహానాడు జాతీయ కమిటీ గౌరవాధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్

ఎస్సీ వర్గీకరణకు చేసిన అసెంబ్లీ తీర్మానం ప్రతుల దహనం

ముషీరాబాద్,మార్చి 19: (విజయక్రాంతి) : మాల జాతులను దెబ్బతీసిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని తెలంగాణలో బొం ద పెట్టాలని మాల మహానాడు జాతీయ కమిటీ గౌరవాధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్ అన్నారు. ఈ మేరకు బుధవారం లోయర్ ట్యాంక్ బండ్ లోని డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని  చేపట్టారు. ముందుగా ఎస్సీ వర్గీకరణకు చేసిన అసెంబ్లీ తీర్మాన ప్రతు లను మాలమహానాడు నాయకులు దహనం చేశారు.

ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ కమిటీ గౌరవ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ మాట్లాడుతూ మాల జాతులకు దెబ్బతీసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో బొంద  పెట్టాలని, వర్గీకరణకు మద్దతు ఇచ్చిన అన్ని పార్టీల పైన తిరుగుబాటు చేయడానికి మహా సమాజం రోడ్లపైకి పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో ఎస్సీ కులాల జనాభా లెక్కలు లేవని, కానీ 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ వర్గీకరణ చేయడం రాజకీయ కుట్రని విమర్శించారు. దీనిపైన ఉన్నత న్యాయస్థానాల్లో సవాల్ చేస్తామని, ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అడ్డుకుంటామని ప్రయత్నించారు.

మాలల పక్షాన చట్టసభల్లో బల మైన గళం వినిపించాల్సిన మాల మంత్రు లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వివేక్ వెంకటస్వామి నాయకత్వంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి హోల్సేల్గా అమ్ముడుపోయారని ఆరోపించారు.

నిరసన కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి సంపు శ్రీనివాసులు. జాతీయ అధ్యక్షులు డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు గవ్వల శ్రీ కాంత్. ఎస్సీ ఎస్టీ అడ్వకేట్ ఫోరం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దిల రాయప్ప పాల్గొన్నారు.